హోచిమిన్ సిటీ : అమెరికా నుండి వియత్నాంకు మారిజువానా అక్రమ రవాణా జరుపుతున్న ముఠా గుట్టును వియత్నాం కస్టమ్స్ శాఖ అధికారులు రట్టు చేశారు. హోచిమిన్ నగరంలోని టాన్ సన్ నాట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఈ అక్రమ రవాణా జరుగుతోందని గుర్తించారు. ఇందుకు సంబంధించి హోచిమిన్ నగరానికి, సెంట్రల్ బిన్ దిన్ ప్రావిన్స్‌కి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియా, ఫిలడెల్ఫియాల నుండి వచ్చే, పలు వస్తువుల్లో దాచి వుంచిన 5.2కిలోల మారిజువానాను వీరు అందుకోవాల్సి వుంది.