ఇదేనా ఆరోగ్యానికి భరోసా?

0
29

రాష్ట్రంపై డెంగ్యూ విసిరిన పంజాకు ఏజెన్సీ మైదానం, గ్రామం, నగరం అనే తేడా లేకుండా ప్రజానీకం విలవిల్లాడిపోతున్నది. వందల మంది ప్రాణాలను మహమ్మారి బలితీసుకుంది. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, రాయలసీమ, చివరికి రాజధాని ప్రాంతంపై సైతం డెంగ్యూ కోరలు చాచింది. ఒక్క డెంగ్యూనే కాదు మలేరియా, టైఫాయిడ్‌, వైద్యులకు సైతం అంతుబట్టని విషజ్వరాలు జనాన్ని వణికిస్తున్నాయి. కార్పొరేట్‌, ప్రైవేటు, గవర్నమెంట్‌ అస్పత్రులన్నీ జ్వర బాధితులతో కిటకిటలాడుతున్న సన్నివేశాలు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. రెండు వారాలకుపైనుంచే విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. మీడియా కథనాలతోనూ కదల్లేదు. సమస్య తీవ్రమయ్యాక వందలాది మందిని వ్యాధులు కబళించాక ఇప్పుడు తీరిగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌్‌ల్లో యంత్రాంగంపై హూంకరిస్తున్నారు. తప్పంతా వైద్య ఆరోగ్యశాఖ అధికారులదీ, సిబ్బందిదేనని గయ్యిమంటున్నారు. వారి అజాగ్రత్త వల్లనే పరిస్థితులు విషమించాయని శాసనసభలో, బయటా కన్నెర్ర చేశారు. నిర్లక్ష్యం వహించే వారిని స్పాట్‌లో సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. బాగానే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here