ఉపాధికి గుర్తింపు

0
43

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో జాతీయ స్థాయిలో విశాఖ జిల్లా ప్రథమస్థానంలో లభించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాకు జాతీయ స్థాయి ప్రథమ బహుమతిని ప్రకటించింది. మంగళవారం దిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నుంచి జాతీయ స్థాయి అవార్డును స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పూర్వపు పథక సంచాలకులు కల్యాణచక్రవర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో 5.80 లక్షల వేతనదారులకు 225 లక్షల పనిదినాలు కల్పించి, వేతనాల రూపంలో రూ.373.45 కోట్ల మేర చెల్లింపులు చేయడం ద్వారా జిల్లా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీనికి గాను జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. గ్రామాల్లో 1089 కిలోమీటర్ల పొడవు సిమ్మెంటు రోడ్లు వేశారు. 663 అంగన్‌వాడీ భవనాలను నిర్మించారు. 4593 ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకం, 20,991 ఎకరాల్లో కాఫీ తోటల పెంపకం వంటి పనులను ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో పూర్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here