కత్తెర తెగులు నియంత్రణకు చర్యలు

0
35

అమరావతి బ్యూరో:
కత్తెర తెగులు(ఆర్మీవర్మ్‌)ను యుద్ధ ప్రాతిపదికన నియంత్రించాలని, కర్ణాటకలో దీని వ్యాప్తి ఉన్నందున సరిహద్దు జిల్లాల్లో విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై సోమవారం టెలికాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌలు రైతులకు పంట రుణాలు పంపీణీలో లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఖరీఫ్‌, రబీ సాగులో రైతులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవా లన్నారు. మిర్చి పంటకు తెగుళ్లు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here