కొనసాగుతున్న సహాయక చర్యలు

0
51

లూథియానా/కొచ్చి/తిరువనంతపురం : వరద ప్రభా వం నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కేరళలో ఇంకొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్ధలు తమదైన సహాయాన్ని అందిస్తు న్నాయి. ధ్వంసమైన రోడ్లు, భవనాలు తదితరాల పునర్నిర్మా ణంలో కేరళ ప్రజలకు చేదోడుగా నిలుస్తున్నాయి. అలప్పుజా జిల్లాలోని ప్రసిద్ధ చర్చిని ఆదివారం శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఖల్సా ఎయిడ్‌ సంస్ధకు చెందిన సిక్కు వలంటీర్లు సోమవారం ఒక ఆలయాన్ని శుభ్రపరిచే పనిలో పడ్డారు. ఓనం ఉత్సవాలు జరుపుకునే వారికి ఆలయాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కుట్టనాడులోని తలవాడి గ్రామంలో ఉన్న పనయన్నుర్‌కవు దేవి ఆలయాన్ని శుభ్రపరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here