కొలిక్కి వచ్చిన కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు సర్వే

0
41

బళ్లారి, న్యూస్‌టుడే: కర్ణాటక-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు సర్వే ఆరో రోజు సోమవారం కూడా కొనసాగింది. సర్వే ఆఫ్‌ ఇండియా అధికారి దీపక్‌నేని నేతృత్వంలో హలకుంది, హొన్నళ్లి గ్రామాల్లో రైల్వే మార్గం పక్కనే ఉన్న పొలాల్లో సరిహద్దు రాళ్ల ఆధారంగా జీపీఎస్‌ అమర్చి సర్వే నిర్వహించారు. సర్వే ఆఫ్‌ ఇండియా సంచాలకుడు పవన్‌కుమార్‌ నేతృత్వంలో సండూరు తాలూకాలోని తుమిటి, విఠలాపురం గ్రామాల్లో సరిహద్దులోని గనుల కొండలు, వ్యవసాయ భూమిలోని సర్వే రాళ్లు, గ్రామాల రెవెన్యూ పాయింట్లకు జీపీఎస్‌ యంత్రాలను అమర్చి హద్దులు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కర్ణాటక సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ (సీనియర్‌ ఐఏఎస్‌) అధికారి మనీష్‌ మౌద్గిల్‌, అటవీ శాఖాధికారి బిస్వాజిత్‌ మిశ్రా, ఆంధ్రప్రదేశ్‌ సర్వే, అటవీ శాఖ, ల్యాండ్‌ రికార్డు అధికారుల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాయదుర్గం తాలూకా డి.హిరేహళ్‌ మండలం, ఓబుళాపురం, సిద్దాపురం గ్రామాల సరిహద్దుల్లో ఇప్పటికే గుర్తించిన పాయింట్ల ఆధారంగా జీపీఎస్‌ యంత్రాలను అమర్చి సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓబుళాపురం కంపెనీకి చెందిన మూడు గనులు, ఎ.ఎం.సి., బి.ఐ.పి. గనులతోపాటు, కర్ణాటకలోని నారాయణరెడ్డి గనులు, ఎం.బి.టి. ఇన్‌ట్రేడర్స్‌ తదితర గనుల లీజు పటాల ఆధారంగా ఆరో రోజు సర్వే సాగింది. మంగళవారంతో సర్వే ముగుస్తుందని ఓ అధికారి తెలిపారు.

దీంతో సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉందని గనుల యజమానులు భావిస్తున్నార

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here