క్రీడలకు వర్షం అడ్డంకి

0
29

క్రీడా పోటీలకు వర్షం ఆటంకంగా మారింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శాంతి నగర్‌ కాలనీలోని డిఎస్‌ఎ స్విమ్మింగ్‌ ఫూల్‌ వద్ద జూడో, ఆర్ట్స్‌ కళాశాల వద్ద బాక్సింగ్‌, రిమ్స్‌లో బాస్కెట్‌బాల్‌ పోటీలను సోమవారం నిర్వహించారు. సెట్‌శ్రీ సిఇఒ బివి ప్రసాదరావు నేతృత్వంలో జిల్లా చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాస్‌కుమార్‌ పర్యవేక్షణలో జాతీయ క్రీడా దినోత్సవం పోటీలను నిర్వహించాలని సన్నద్ధమయ్యారు. అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాల కారణంగా హ్యాండ్‌బాల్‌, తైక్వాండో, ఖోఖో పోటీలను మంగళవారానికి వాయిదా వేశారు. వీటితో పాటు వాలీబాల్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, అథ్లెటిక్స్‌, కబడ్డీ, కుస్తీ, టేబుల్‌టెన్నీస్‌ పోటీలను నిర్వహించనున్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి హాకీ మాంత్రికుడు భారతరత్న ద్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం నాడు విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. పోటీలను నిర్వహించిన వారిలో ఒలింపిక్‌ సంఘం జిల్లా కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా కోచ్‌లు శ్రీధరరావు, శిక్షకులు ఎం.ఉమామహేశ్వరరావు, మణికుమార్‌, ఆర్జున్‌, ఎం.భాస్కరరావు క్రీడాకారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here