గాంధీ గ్రామరలో సమస్యలను పరిష్కరించాలి

0
19

ప్రజాశక్తి – చోడవరం
మండలంలోని గాంధీ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం మండల కన్వీనర్‌ నాగిరెడ్డి సత్యనారాయణ, నాయకులు పి.చంద్రశేఖర్‌, పి.చంద్రరావులు డిమాండ్‌ చేశారు. గాంధీగ్రామంలో సోమవారం వారు పర్యటించిన సందర్భంగా స్థానికులు పలు సమస్యలను వారికి వివరించారు. దీనిపై వారు మాట్లాడుతూ, ఎల్‌ఐసి కాలనిలో మంచినీరు రోజూ సరఫరా కాలేదని, ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకు పోవడంతో డెంగ్యూ, మలేరియా వంటి రోగాల బారిన ప్రజలు పడుతున్నారన్నారు. సిసి రోడ్లు నిర్మించి, వాటికి కాలువలు నిర్మించక పోవడంతో నీరు నిల్వ ఉండిపోతుందన్నారు. కొత్తగా నిర్మించిన సామాజిక భవనం వర్షానికి కారిపోతుందని వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here