నాకు ఫుల్‌మీల్స్‌ దొరికింది : సునీల్‌

0
38

అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్రశుక్ల, నందిత తదితరులు నటించిన ‘సిల్లీఫెలోస్‌’ ఇటీవలే విడుదలై ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కి షీల్డును బహూకరించారు. అనంతరం సునీల్‌ మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఆదరించి మంచి ముద్ర వేశారు. ఇండిస్టీకి వచ్చిన కొత్తలో భోజనానికి డబ్బులు లేకపోతే ఓ ఫంక్షన్‌కి వెళితే ఫుల్‌మీల్స్‌ దొరికింది. ఈ సక్సెస్‌ నాకు అదే విధంగా ఉంది. ముందుగా నేను నరేష్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. నేను డైలాగ్స్‌ చెప్పేటప్పుడు నాకు హెల్ప్‌ చేశారు. భీమనేని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సెట్‌లో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి స్క్రిప్ట్‌ గురించి వివరించి మరీ బాగా చెప్పారు. ఓపిక చాలా ఎక్కువ. హీరోయిన్స్‌ కూడా చాలా బాగా నటించారు. గౌతంరాజు గారు చాలా జాగ్రత్తగా చాలా బాగా ఎడిట్‌ చేశార’ని తెలిపారు. నిర్మాత కిరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతకుముందు ‘నేనేరాజు నేనే మంత్రి’, ‘ఎంఎల్‌ఎ’. చిత్రాలు నిర్మించాం. పొలిటికల్‌ చిత్రాలే అని అందరూ అంటున్న తరుణంలో పూర్తి వినోద చిత్రాన్ని తీయాలని చేసిన ప్రయత్నమిది. దీంతో భిన్నమైన కథల్ని కూడా తీయగలమని నమ్మకం ఏర్పడింది’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భరత్‌ చౌదరి, అల్లరి నరేష్‌, అనిల్‌ సుంకర్‌, పోకూరి బాబురావు తదితరులు మాట్లాడారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here