లఖ్వార్‌ ప్రాజెక్టు కోసం ఆరు రాష్ట్రాలతో ఎంఒయు కుదుర్చుకున్న కేంద్రం

0
33

న్యూఢిల్లీః యమునా నదిపై నిర్మించ తలపెట్టిన లఖ్వార్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలతో ఎంఒయు కుదుర్చుకున్నది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఎంఒయుపై సంతకం చేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియా, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖత్తార్‌, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఎంఒయుపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాఖండ్‌లోని లోహారి గ్రామంలో 204 మీటర్ల ఎత్తు కలిగిన ప్రాజెక్టును నిర్మిస్తారు. నీటి ఇబ్బందులను అధిగమించడానికి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here