ముంబయి : శివాజీ శకం చరిత్రను తిరగరాయాలని భావిస్తున్న సనాతన్ సంస్థ నుండి తనకు ముప్పు వుందని మరాఠా ప్రజల రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న నేతల్లో ఒకరు, రచయిత, చరిత్రకారుడు శ్రీమత్ కొకటె (45) తెలిపారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన, సమాజాన్ని విభజించడానికి పైగా హిందూ మతాన్ని అప్రతిష్టపాల్జేయడానికి సనాతన్ సంస్థ ప్రయత్నిస్తోందని విమర్శించారు.