Sidebar


Welcome to Vizag Express
తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని భక్తులు మరణించడం చాలా బాధాకరం.

09-01-2025 22:07:48

తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటుచేసుకొని భక్తులు మరణించడం చాలా బాధాకరం.

 రణస్థలం, వైజాగ్ ఎక్సప్రెస్, జనవరి 9

 ఎచ్చర్ల  నియోజకవర్గం రణస్థలం మండలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్ మాట్లాడుతూ నిన్న తిరుపతి లో జరిగిన తొక్కిసలాట లో మృతి చెందిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ రణస్థలం మండల కేంద్రం నందు పత్రిక సమావేశం లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఒక్క సినిమా ఫంక్షన్ కి మంత్రులు కలెక్టర్ అధికారులు రివ్యూ చేసుకుంటారు మరి ఇంత పెద్ద పండుగకు రివ్యూ చేసుకోరా
రివ్యూ చేసి సరైన ఏర్పాట్లు చేయరా భక్తులకు కనీస ఏర్పాట్లు చేయరా రాష్ట్ర చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎప్ప్పుడు ఇలాంటి సంఘటన ఇంతకు ముందు జరగలేదు ఈ ఘటన పూర్తిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం,  భక్తుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం భక్తుల మరణాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాపం తగలదా ముక్కోటి ఏకాదశి ప్రతీ సంవత్సరం జరిగే కార్యక్రమం కనీస ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి పాలకమండలి, టిటిడి అధికారులు నిర్లక్ష్యం వహించారు ఆరుగురు పైగా భక్తులు మరణించారు, దాదాపు నలభై మంది భక్తులు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు 
ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి పాలకమండలి, టిటిడి అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలి తిరుపతి లడ్డు లో కలపని కల్తీ నెయ్యి పై గగ్గోలు పెట్టి ఆరు రోజులు దీక్ష చేసిన పవన్కళ్యాణ్ వెళ్లి ప్రయోగరాజ్ లో మునిగి పాప ప్రక్షాళన చేసుకుంటారో లేకపోతే నైతిక బాధ్యతగా కూటమి నుండి బయటకు వెళ్తారో నిర్ణయించుకోవాలి గత వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు.రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే ఏర్పాట్లలో చాలా లోటు పాట్లు ఉన్నాయి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో ఉదయం నుంచి ఉన్న భక్తులకు కనీసం మంచి నీళ్లు గాని ఇవ్వలేదు, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు
ఉదయం నుంచి భక్తులను లైన్లో ఉంచి సాయంత్రం ఒక్కసారిగా గేట్లు తీసి లోపలికి పంపించాడంతో ఇటువంటి ఘటన చోటు చేసుకుంది
ప్రభుత్వం గాని, అధికారులు గాని, పోలీస్ వ్యవస్థ గాని సామాన్య ప్రజలకు సరైన పాలన అందించడం లేదనడానికి తిరుపతిలో జరిగిన ఈ దుర్ఘటనే నిదర్శనం కేవలం కక్షపూరితంగా ఈ రాష్ట్రంలో ఉన్న వైసిపి నాయకుల మీద రాజకీయ కక్ష తీర్చుకోవడానికే కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది
 ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు క్షతగాత్రులకు ఏభైలక్షలు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం  ఈ పత్రిక సమావేశం లో జడ్పీటీసీ టోంపల సీతారాం, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, మండలఎంపీటీసీ ల సంఘం అధ్యక్షులు మహంతి చిన్న రాము నాయుడు, మాజీ సర్పంచ్ పిన్నింటి లక్ష్మనాయుడు, వైసీపీ నాయకులు బోనెల చంద్రశేఖర్, మింది శ్రీనివాస్, రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.