రూ.6 లక్షలతో భోజనశాల
09-01-2025 22:11:54
రూ.6 లక్షలతో భోజనశాల
ఇచ్ఛాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 9
మున్సిపల్ బాలికోన్నత పాఠశాల స్థలదాత కాదా లక్ష్మీకాంతం మనవడు డాక్టర్ కాదా మన్మధ కుమార్ (లండన్ ) విద్యార్థుల కోసం రూ. 6 లక్షలతో నిర్మించిన భోజనశాల(గది )ను మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజలక్ష్మితో పాటు దాత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం మా నాన్నమ్మ స్థలం దానం చేసి ఎంతోమంది ఆడపిల్లలకు చదువుకునేలా చేశారని ఆమె గుర్తుగా విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో మట్టి నేలపై కూర్చొని భోజనం చేయటం విషయం తెలుసుకుని మనసు చలించిపోయిందని అన్నారు. అందుకే విద్యార్థుల కోసం భోజనశాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ కాదా కుటుంబీకులు ఆడపిల్లల చదువు కోసం చేసిన త్యాగాలను కొనియాడారు. పట్టణ ప్రజలతో పాటు ప్రతి విద్యార్థి కాదా కుటుంబీకులకు రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్, యాదవ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, ఎస్ఎంసి చైర్మన్ గిన్ని వెంకటరమణ, కౌన్సిలర్ బచ్చు జగన్ రెడ్డి, బి కృష్ణయ్య, టీ జనార్దన్ రెడ్డి, కాదా కుటుంబీకులు డాక్టర్ కాదా వెంకటేశ్వరరావు, ఛాయా, డాక్టర్ కె.వి మన్మధ కుమార్ (లండన్ ) కాదా కార్తీక, కాదా వెంకటరమణ, పాఠశాల హెచ్ఎం ఎస్ పద్మవల్లి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు