Sidebar


Welcome to Vizag Express
ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దన్నాన రాజి నాయుడు.

09-01-2025 22:13:08

ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం,  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దన్నాన రాజి నాయుడు. 

 లావేరు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 9

 లావేరు  మండలంలో ఎంపీపీ, జెడ్పిటిసి, మరియు సర్పంచులు,ఎంపీటీసీలు, వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిప్రాయాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం  మాజీ శాసనసభ్యులు  గొర్లె కిరణ్ కుమార్ దన్నాన రాజి నాయుడు గారు పేరును ప్రతిపాదించడం జరిగినది లావేరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దన్నాన రాజి నాయుడు  మండల నాయకులతో కలిసి దుశ్శాలువతో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అభినందించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  మాట్లాడుతూ  పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని సూచించారు. అదేవిధంగా  కార్యకర్తలుకు, పార్టీకి అన్యోన్య బంధం ఏర్పరిచాలని మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ అన్నారు.  కార్యకర్తలందరూ కలిసి పార్టీని గెలుపు బాటలో తీసుకెళ్లడానికి కష్టపడి పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో లావేరు మండల ఎంపీపి ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్పిటీసీ మీసాల సీతం నాయుడు,మండల జేసిఎస్ కన్వీనర్ మీసాల శ్రీనివాసరావు, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు షేక్ ఛాన్ భాషా, ఎంపిటీసీల సంఘం అధ్యక్షులు ప్రతినిధి జగ్గురోతు తవిటి నాయుడు,సర్పంచ్ ప్రతినిధి దుర్గాసి ధర్మారావు, ఎంపిటీసీ ప్రతినిధి గంట్యాడ సత్యం,యువనాయకులు దన్నాన హరి,ఇజ్జాడ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.