Sidebar


Welcome to Vizag Express
మత్స్యకార ఉప కులాలు ను వర్గీకరణ చేయాలి

09-01-2025 22:15:26

మత్స్యకార ఉప కులాలు ను వర్గీకరణ చేయాలి

మత్స్య కార నేత పీక్కి కోదండరాం 


సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 9

మత్స్యకారుల ఉప కులాలను వర్గీకరణచేయాలని  రాష్ట్ర మత్స్య కార నేత పీక్కి కోదండరాం  ప్రభుత్వాన్ని కోరారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సామాజిక వర్గంలోనైనా అయినా అసమానతలు ఉంటాయి కనుక అన్ని మత్స్య కార ఉపకులాలు సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని , ఆంధ్రప్రదేశ్ లో 14  మత్స్య కార జాతులు ఉన్నాయని , అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు,మత్స్య కార ఉప కులాలుగా ఉన్న ఉప కులాలనువర్గీకరణ చెయ్యాలని డిమాండ్ చేశారు.ఈ వర్గీకరణ చేయకపోతే జరిగే నష్టాన్ని వివరించారు. ఉపకులంలో ఒకటి రెండు ఉప కులాలు   కులం లో ఉన్న వాళ్ళు క్యాబినెట్ హోదా మరియు అర్థక, విద్య ఉద్యోగ రంగాల్లో  పెద్దల సభకు వెళ్లే  పరిస్థితి ఉంటుంది కాబట్టి మిగతా 12మత్స్య కార ఉప కులాలు నేటి వరకు అసెంబ్లీ గేటు దాటిన , క్యాబినెట్ హోదా , ఐఎఎస్ వారు లేరని చెప్పారు. వీరు పక్షాన గొంతెత్తి మాట్లాడడానికి కనీసం అవకాశం లేకుండా ఉంటుంది కనుకఈ 14 మత్స్య కార ఉప కులాలు సామాజికంగా రాజకీయంగా నైతికంగా  ఆర్థికంగా  ఉద్యోగాల్లో అభివృద్ధి చెందాలి కాబట్టి మత్స్యకారి జాతిఉప కూలాలు ను వర్గీకరణ చేయాలని మత్స్య కార నేత కోదండరాం స్పష్టం చేశారు .ఈ కార్యక్రమంలో మత్స్య కార నాయకులు చింతకాయల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు