Sidebar


Welcome to Vizag Express
ఈ షోరూమ్ లో బైక్ కొంటే అంతే సంగతులు

09-01-2025 22:18:21

ఈ షోరూమ్ లో బైక్ కొంటే  అంతే సంగతులు

సోంపేట  వైజాగ్ ఎక్స్ ప్రెస్ జనవరి 9: 

 సోంపేటక కూత వేటు దూరంలో ఉన్న  జింకిభద్ర రోడ్డులో  త్రిష హీరో హోండా షోరూం లో బండి కొంటే వినియోగదారుడు పని అంతే. వివరాల్లోకి వెళితే గత వినాయక చవితి కి ఈ షోరూంలో ద్విచక్ర వాహనం తీసుకున్న వినియోగదారుడు  ఇప్పుడు పండగొచ్చినా   ఆర్ సి పేపర్లు గాని ,ఇన్సూరెన్స్ గాని లేక వినియోగదారులకు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారని , యాజమాన్యం  . బండి కొనేటప్పుడు అవి ఇస్తాము ఇవి ఇస్తాం అని చెప్పే యాజమాన్యం ఇప్పుడు కనీసం మొఖం చూడడానికైనా షో రూమ్ లో ఉండక ఫోన్ లిఫ్ట్ చేయక అనేక తిప్పలు పెడుతున్న యాజమాన్యం కి ఏమీ అనాలో అర్థం కావడం లేదని పలువురు వినియోగదారుల ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇప్పటికైనా వినియోదారులు ఇబ్బందులు గమనించి ఈ షో రూమ్ లో గాని బండి కొంతే తిప్పల తప్ప మరి ఏ పని జరిగే పరిస్థితి లేక అటు పోలీసులు రోడ్డుపై తనిఖీలు నిర్వహించేటప్పుడు జరీమాణాలు చెల్లించక తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. షోరూమ్ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించుకున్న కనీసం స్పందించకపోవడంతో వినియోగదారులు పోలీస్  స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు