Sidebar


Welcome to Vizag Express
ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన కలెక్టర్

09-01-2025 22:29:22

ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన కలెక్టర్ 

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 9 :
అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణం మునిసిపల్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును గురువారం బాపట్ల జిల్లా కలెక్టర్ జే.వెంకట మురళి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అఖండ ఫౌండేషన్ ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలనీ ఆకాంక్షించారు.ఈ మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్ డీ ఓ గ్లోరియా,డీ ఎమ్ హెచ్ ఓ డాక్టర్ విజయమ్మ,తహసీల్దార్ ఎస్.కె.సలీమా,మునిసిపల్ కమీషనర్ జీ.రఘునాథరెడ్డి,అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్,పట్టణ బీజేపీ నాయకులు మామిడి రమేష్,వైద్యులు తదితరులు పాల్గొన్నారు.