Sidebar


Welcome to Vizag Express
ఆదివాసి విద్యా ఫౌండేషన్ కు నాలుగేళ్లు

10-01-2025 21:28:15

ఆదివాసి విద్యా ఫౌండేషన్ కు నాలుగేళ్లు 

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు 

ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి,10: గిరిజన యువతి యువకులకు, పోటి పరీక్షల్లో రాణించి ఉద్యోగ అవకాశాల్లో స్థిరపడి మంచి భవిష్యత్తు పొందాలనే లక్ష్యంతో స్థానిక పెద్దలు, ఉపాధ్యాయులు, వర్తక వ్యాపారులు, మండల స్థాయి అధికారులు, పాత్రికేయ మిత్రులు, యువకుల, సహాయ సహకారాలతో మండల కేంద్రంలో ఆదివాసి విద్యా ఫౌండేషన్ స్థాపించి నాలుగు వసంతాలు పూర్తి పూర్తిచేసుకుని 5 వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా శుక్రవారం స్థానిక బి.ఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపం వద్ద ఎస్సై జె రామకృష్ణ చేతుల మీదుగా కేక్ కటింగ్ నిర్వహించారు. జనవరి 10, 2020 సంవత్సరంలో అప్పటి ఎస్ ఐ ప్రసాద్ రావు ఉపాధ్యాయులు గంపరాయి కృష్ణమూర్తి, భాజంగి బాబురావు, ముఖి రామకృష్ణ, స్థానిక ఉపాధ్యాయ బృందంతో ఆదివాసి విద్యా ఫౌండేషన్ స్థాపించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై జయ రామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసి విద్యా ఫౌండేషన్ ఏర్పాటు చేసి గత నాలుగేళ్లు ఆదివాసి గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు అనేక మందికి ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ అందించడం గొప్ప విశేషం అన్నారు. పెద్దలు స్థాపించిన ఈ ఆదివాసి ఫౌండేషన్ మరలా ప్రారంభించామని వచ్చే నెల జరగబోయే ఎస్ జి డి కానిస్టేబుల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై జె రామకృష్ణ తెలిపారు. ఆదివాసి విద్యా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పేద విద్యార్థులకు పోటీ పరీక్షలు ఉచిత శిక్షణ ఇవ్వాలని రుణ సంకల్పంతో అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ ఫౌండేషన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ స్థాపకులు, పెద్దలు, తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు,కూడా దాసు, రామారావు, జగదీశ్వరరావు, నిరుద్యోగ యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు