సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
10-01-2025 21:29:17
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎస్సై జె రామకృష్ణ
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,10: సైబర్ నేరాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే వ్యక్తుల పట్ల ప్రజలు, గిరిజన యువత అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై జె రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండలంలో జోలపుట్టు పంచాయతీ, జప్పార్ గ్రామంలో స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ నేరాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసం చేసేవారిపట్ల, అప్రమత్తంగా ఉంటూ అనుమాన స్పదంగా ఎవరు కనిపించిన తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన తెలియజేశారు. గిరిజన యువత గంజాయి, సాగు రవాణా సారాయి వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అప్పుడే కుటుంబాలతో సంతోషంగా ఉంటారని ఉండే అవకాశం ఎక్కువగా ఉందిని ఆయన చెప్పారు. గ్రామాల్లో చదువుకుని ఖాళీగా ఉన్న యువతకు ఉద్యోగుల వైపు దృష్టి సారించి ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. యువత గంజాయి సాగు రవాణా, అమ్మకాలు, విక్రయాలు దూరంగా ఉండాలని అలాంటివారు పోలీసులకు చిక్కితే కఠిన చర్యలతో పాటు జైలు పాలు అవుతారని ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కోల్పోతారని కుటుంబాలు చిన్నాభిన్నమవుతుందని ఆయన పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువతీ యువకులు మహిళలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.