Sidebar


Welcome to Vizag Express
గుమడ గ్రామంలో గోశాలల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

10-01-2025 21:32:22

గుమడ గ్రామంలో గోశాలల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే 
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్,
 జనవరి 10:
 కొమరాడ మండలంలోని గుమడ గ్రామంలో నిర్మించిన రెండు గోశాలలను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభోత్సవం చేశారు. ఆమెమాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. మునుపెన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు  శరవేగం గా జరుగుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు  దత్తి ధర్మ భార్య సర్జరీ విషయం తెలుసుకున్న ఆమె ధర్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శన పతి శేఖర్ పాత్రుడు, జనసేన ఇంచార్జ్ కడ్రక మల్లేష్, జనసేన మండల కన్వీనర్ శ్రీకర్, కృష్ణ బాబు,  పొట్నూరు వెంకట నాయుడు, నంగి రెడ్డి మధుసూదన్ రావు, దేవకోటి వెంకట నాయుడు, ఎంపీడీవో  మల్లికార్జున్ రావు, ఉపాధి హామీ ఎపివో బాలకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.