Sidebar


Welcome to Vizag Express
గురుకుల పాఠశాల బాలికలను పరామర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్ షియాజ్ ఖాన్:

10-01-2025 21:47:20

గురుకుల పాఠశాల బాలికలను పరామర్శించిన సీనియర్ సివిల్ జడ్జ్ షియాజ్ ఖాన్:
 నర్సీపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10: నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేములుపూడి కస్తూరిబా గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిలను నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పిల్లలతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైద్య అధికారులను అడిగారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. వేములపూడి కస్తూరిబా గురుకుల బాలికల హాస్టల్ లో బుధవారం కలుషిత ఆహారం భుజించిన  విద్యార్థినులు, విరోచనాలు వాంతులు తో అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే.