Sidebar


Welcome to Vizag Express
జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

10-01-2025 21:52:39

జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 10:


సోంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఫేర్ వెల్ ఫంక్షన్ మరియు సంక్రాంతి సంబరాలు శుక్రవారం కన్నుల పండుగగా జరిగాయి. ప్రిన్సిపాల్ మోహనరావు  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిధులుగా సహలాలపుట్టుగ హైస్కూలు హెచ్ఎం ప్రమోద్ పాడి ,బూరగాం హెచ్ఎం సోమేశ్వరరావు . ఎపి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చిన్నజీ వర్మా ప్రిన్సిపాల్
 రజినికుమారి తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమం లో భాగంగా సంక్రాంతి ముగ్గుల పోటీ లలో ప్రధమ. ద్వితీయ. తృతీయ బహుమతులు .టి ఉష.బి స్వాతి.బి  శృతి,లు దక్కించుకున్నారు.  విద్యార్థులు స్టాఫ్ భోగి మంటలు వేశారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ  బాగా చదివి పరీక్షల్లో లో మంచి మార్క్లు తెచ్చుకోవాలి అన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల సిబ్బంది ,విద్యార్థులు ,తల్లి తండ్రులు పాల్గొన్నారు.