ఎర్రముక్కాం వాసికి అరుదైన గౌరవం!
రోబోటిక్స్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్
కంపెనీ సిఈఓ కు ప్రశంసలు
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 10;
సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన బైపల్లి వల్లభరావు ( సన్ ఆఫ్ తాతారావు ) కు అరుదైన గౌరవం దక్కింది. ఫైటెక్ ఎంబెడెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఇఓగా ఉన్న వారి అసాధారణ విజయాలపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ రోబోటిక్స్ ఆవిష్కరించి శుక్రవారం ప్రశంసించారు. వల్లభరావు సారధ్యంలో, ఫైటెక్ ఎంబెడెడ్ కంపెనీ విశేషంగా అభివృద్ధి చెందుతూ, 100 మందికి పైగా టెక్నికల్ నిపుణులకు ఉద్యోగ అవకాశాలను కల్పించింది. అందులో 70 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు కావడం విశేషం.వల్లభరావు గొప్పతనాన్ని చాటే మరో విషయం వారి మూలాలను ఎప్పటికీ మర్చిపోకుండా, ఎర్రముక్కం గ్రామానికి చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో చూపిన కృషి. ఆ గ్రామం నుంచి ఐదుగురిని ఫైటెక్ కంపెనీలో నియమించి, బోష్, ఎల్‌జీ, మరియు క్వాల్‌కామ్ వంటి పేరొందిన కంపెనీల్లో స్థిరపడేందుకు సహకరించారని పలువురు ప్రముఖులు ఈ సంధర్భంగా కొనియాడారు.తాజాగా సివిల్ ఏవియేషన్ యూనియన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ప్రెస్టీజియస్ ఎక్స్‌పోలో వల్లభరావు శుక్రవారం సమావేశం, డిజిటల్ టెక్నాలజీ సమీట్ వైజాగ్ లో జరిగింది . వారి ప్రభావం మరియు పేరును మరింతగా చాటిచెప్పిందని అన్నారు.ఏపీ డిజిటల్ ఇండియా కార్యక్రమం యొక్క ముఖ్య సమన్వయకర్తగా, ఫైటెక్ యొక్క ఎడ్జ్ ఏఐ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ను ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్‌లో ఫైటెక్ సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. అలాగే, ప్రపంచ స్థాయిలో అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్ మరియు డ్రోన్స్ వంటి సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించారు.ఈ విజయాలు వల్లభరావు గవ్యక్తిగత గౌరవం మాత్రమే కాక, ఎర్రముక్కం గ్రామానికి గర్వకారణం కూడా. వారి కష్టం, సంకల్పం, మరియు సామాజిక బాధ్యతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచారని గ్రామానికి చెందిన విజయవాడ మణిపాల్ ఆసుపత్రి ప్రఖ్యాత కార్డియో తొరాసిస్ సర్జన్ దిలీప్ కుమార్ రట్టి , ప్రిన్సిపాల్ అంబటి మోహనరావు ,బాహడపల్లి హెచ్ ఎం అంబటి ,కృష్ణమూర్తి ,గ్రామస్తులు బైపల్లి వల్లభరావు ఈ ప్రత్యేక సందర్భంలో మా హృదయపూర్వక అభినందనలు.తెలిపారు. మీ విజయయాత్ర ఇలానే కొనసాగి మరింత మందిని ఉత్తేజపరచాలని కోరారు.