Sidebar


Welcome to Vizag Express
శ్రీనివాస్ కుటుంబానికి అండగా జగన్ !

10-01-2025 21:57:58

శ్రీనివాస్ కుటుంబానికి అండగా జగన్ !

సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 10:

కవిటి మండలం ఎర్ర గోవింద పుట్టుగ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో పెద్దను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వారికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కంచిలి మండలం ఎక్కల గ్రామానికి చెందిన నెయ్యల బెహరా జగన్నాద్ అండగా నిలిచారు. ఎర్ర గోవింద పుట్టుగలో బుడంకాయల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఎవరు సహాయం లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్న విషయం తెలుసుకుని జగన్ శుక్రవారం ఆ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా రెండు బియ్యం పాకెట్లు, కిరాణా సరకులు అందజేశారు. ఎటువంటి కష్టం కలిగిన ఆదుకుంటామని మృతుడు భార్య భూలక్ష్మి కి భరోసా ఇచ్చారు. జగన్ సహాయం పట్ల ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్రి కేశవరావు, బల్ల జానకిరావు, మద్ధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.