కుమార్ నాయక్ సమర్పణలో "వెయిటింగ్ "
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 10:
ఎస్ .ఎస్. క్రియేషన్ బ్యానర్ పై శివశంకర్ రచన, దర్శకత్వంలో డాక్టర్ .కుమార్ నాయక్ సమర్పణలో"" వెయిటింగ్"" తెలుగు, హిందీ ,ఒడియా,( త్రిభాషా) వెబ్ సిరీస్ ను జిల్లాలోని పలు ప్రాంతాల్లో శరవేగంగా గడచిన వారం రోజుల నుండి షూటింగ్ జరుగుతుంది. బాల నటుడు నంద గోపాల్ క్లాప్ కొట్టగా, స్వాతి నిర్మాతగా ఉన్నారు.
హీరో హీరోయిన్లుగా గోపాల్ రెడ్డి శృతి నటించగా బాలనటుడిగా నందగోపాల్ ,ప్రధాన పాత్రలో డాక్టర్ కుమార్ నాయక్ , విలన్ గా చోటు ఆశిష్ ,పత్రి తాతారావు, నటించగా డి.ఓ.పి.గా వరుణ్ నాయక్ , ఎడిటర్ గా రాజేష్ ,యూనిట్ మేనేజర్ గా వీరేందర్ ,అసిస్టెంట్ కెమెరామెన్ గా సాయి ,వ్యవహరిస్తున్నారు ,లవ్ కం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆధ్యంతము 30 ఎపిసోడ్లుగా కొనసాగుతుందని డైరెక్టర్ శివ తెలిపారు. కళారంగాన్ని నమ్ముకుని జానపద నటుడుగా ఉన్న కుమార్ నాయక్ ఇటువంటి చిత్రాలు ప్రేక్షకులకు అందించడం ఆనందం ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు