విజేతలకు ప్రశంసా పత్రం, షీల్డ్ ప్రధానం
10-01-2025 22:16:38
విజేతలకు ప్రశంసా పత్రం, షీల్డ్ ప్రధానం
అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10 : యువ కేంద్రం తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ 2024-25 అనపర్తి జిబిఆర్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగిందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ పెద అబ్బాయి రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రిన్సిపల్ అబ్బాయి రెడ్డి మాట్లాడుతూ వాలీబాల్, కబాడీ, రన్నింగ్ ,షాట్ పుట్ విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరిగిందని ఈ పోటీల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు పాల్గొనగా ప్రధమ,ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రం, షీల్డ్ అంద చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కిషోర్, ఆకుల సత్య, మహేంద్ర రెడ్డి, బర్న, డేవిడ్, ఈఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సిహెచ్ ఆనందరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.