Sidebar


Welcome to Vizag Express
స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సత్తి దంపతులు

10-01-2025 22:18:12

స్వామివారిని దర్శించుకున్న  మాజీ ఎమ్మెల్యే సత్తి దంపతులు 
అనపర్తి,వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 10 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని విష్ణాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.వైకుంఠ ఏకాదశిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు  మన్నారయణుడు మూడు కోట్ల దేవతలతో భూమి మీదకు వస్తారని అనాదీగా భక్తులు విశ్వసిస్తుంటారు.కాగా అనపత్తి పాత గుడి లోపల సత్తిపోతా రెడ్డి,తేతలి రామిరెడ్డి రామాలయంలో గల సీతారాములు, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదిలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి  దర్శించుకున్నారు.