Sidebar


Welcome to Vizag Express
ఉత్తర ద్వారం దర్శించుకున్న

10-01-2025 22:19:30

ఉత్తర ద్వారం దర్శించుకున్న
ఎమ్మెల్యే గణబాబు
 
ఎన్ఏడి- వైజాగ్ ఎక్స్ప్రెస్. జనవరి 10: జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గం 57 వ వార్డ్ తుమ్మడిపాలెం లో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భముగా  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు ప్రభుత్వ విప్ ఈ మేరకు శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు విచ్చేయడం జరిగింది ఆయనకు వేదమంత్రాలతో ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఆహ్వానించారు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 57 వార్డ్ పెంటకోట అజయ్ బాబు, 54 వ వార్డు, కార్తీక్ కుట్టా, కిల్లి శ్రీరామ్మూర్తి, జనసేన నాయకులు స్థానిక గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.