Sidebar


Welcome to Vizag Express
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు టీజేఎఫ్ తోనే సాకారం కావాలి

10-01-2025 22:33:04

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు టీజేఎఫ్ తోనే సాకారం కావాలి

. సంస్కృతి, సంప్రదాయాలు చాటిచెప్పడం అభినందనీయం
 నగర పోలీసు కమిషనర్
 శంఖభ్రత బాగ్చీ వెల్లడి
 
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 10;
 జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలన్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు.  ఆ కల టీజేఎఫ్ తోనే సాకారం కావాలని ఆకాంక్షించారు. టీజీఎఫ్ జర్నిలిస్టుల సంక్షేమం కోసం  చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు.   తెలుగు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ,   గతంలో టీజేఎఫ్ జర్నలిస్టుల భద్రత కోసం హెల్మెట్ల ను పంపిణీ చేసిన కార్యక్రమం తనకు ఎంతో నచ్చిందని, ఇది ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.  మన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనంందంగా ఉందన్నారు. పాత్రికేయులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఉపకార్ ట్రస్టు ద్వారా చేయూతను అందిస్తామని  సినీ హీరో కంచర్ల ఉపేంద్ర అభయమిచ్చారు. ఇలాంటి కార్యక్రమానికి తనను ఆహ్వానించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ,  తెలుగు జర్నిలిస్టుల ఫోరమ్ సంక్రాంతి వేడుకల్లో తన సొంత కుటుంబంతో పాల్గొన్నంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. జర్నలిస్టులకు ఎటువంటి సమస్య వచ్చినా ఎలాంటి పోరాటానికైనా సరే  చేయడానికి సిద్ధంగా ఉన్నానని బీజేపీ అరకు పార్లమెంట్ ఇన్ చార్జి పరశురామ రాజు  తెలిపారు. పని ఒత్తిడిలో అలసిపోయే జర్నిలిస్టులు ఇలాంటి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పాత్రికేయుల సంక్షేమం కోసం తెలుగు జర్నలిస్టుల ఫోరమ్ చాలాకాలంగా అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించామని తెలుగు జర్నిలిస్టు ఫోరమ్ (టీజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వర చౌదరీ వెల్లడించారు. ఈ  సందర్భంగా వేడుకల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. సంక్రాంతి సంబరాల వేడుకల్లో భాగంగా సంక్రాంతి కానుకలను జర్నలిస్టులకు ముఖ్య అథిధులు చేతులు మీదుగా అందచేసారు.  ఈ వేడుకల్లో తెలుగు జర్నలిస్టు ఫోరమ్ స్టేట్ వర్కింగ్  ప్రెసిడెంట్ డా. జార్జ్,  విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎం ఎస్ రావు, కార్యదర్శి పీటర్  ప్రదీప్, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ తో పాటుగా గౌరవ సలహాదారు ముళ్లపూడి కోటేశ్వరరావు పాల్గొన్నారు.