బొత్స కామెంట్స్..
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నా..
తిరుమల తొక్కిసలాట చాలా బాధాకరం..
ప్రభుత్వం వైఫల్యం వలన ఇలా జరిగింది..
ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్ధత వలన ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి..
గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదు..
తిరుపతిలో జరిగిన సంఘటనను చైర్మన్ దైవ నిర్ణయం అంటున్నారు..
వారి మాటలను ఎలా సమర్థించగలం..
భక్తులు వస్తారని ముందే తెలుసు కదా..?
ప్రభుత్వం నుంచి ఒక్క రివ్యూ అయినా చేశారా..?
అన్ని శాఖల సమన్వయం కోసం గతంలో రివ్యూలు జరిగేవి..
ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక్క సమీక్ష అయినా చేశారా..? విజయవాడ వరదల్లో కూడా మానవ తప్పిదం వలనే ప్రజలు చనిపోయారు..
నీరు, ఆహారం, మందులు అందక జనం చనిపోయారు..
అధికారులకు పార్టీ రంగులు పూస్తున్నారు..
అధికారులతో పని చేయించుకోవాలి..
వారిపై పార్టీల ముద్ర వేయడం సరికాదు..
ఇప్పుడున్న అధికారులు అందరూ టీడీపీ ప్రభుత్వం వేసిన అధికారులే..ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీ ని సస్పెండ్ చేస్తే మిగతా ప్రాంతాల అధికారుల మాటేంటి..?
మరో రెండు ప్రదేశాల్లో తొక్కిసలాట జరిగింది..
ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..
సీఎం చంద్రబాబు 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్నారు..
ఎందుకు సమీక్ష చెయ్యలేదు..
ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఆరా తీయచ్చు కదా..
ఎండోమెంట్ మినిస్టర్ కూడా ఎందుకు రివ్యూ చెయ్యలేదో అర్ధం కాలేదు..
రివ్యూ చెయ్యడానికి సీఎం అనుమతి ఇచ్చారో లేదో తెలియదు..
పవన్ కళ్యాణ్ క్షమాపణతో సరిపెట్టారు..
క్షమాపణ ఒక్కటేనా..?
దీక్ష ఏమైనా చేస్తారా..?
ఆ దీక్ష ఎవరు చేస్తారు..?
తిరుపతిలో జరిగిన ఘటన వలన భక్తుల్లో భయం నెలకొంది..
ఈరోజు సింహాచలంలో భక్తులు ఎక్కువగా రాలేదు..
జనంలో భయం ఉంది..
ఇది చాలా దురదృష్టం..
తొక్కిసలాట నెపాన్ని కూడా గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు..
గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు..తిరుపతి తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చెయ్యాలి..
ఏపీ హై కోర్టు సుమోటోగా కేసును తీసుకొని సిట్టింగ్ జడ్జితో చేయించాలి..
హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి కలగజసుకోవాలి..
వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాను..
మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే కోర్టు ద్వారా దర్యాప్తు అవసరం.. నిన్న జగన్ మొహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం సరికాదు..
ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు..
40 శాతం ఓట్లు సాధించిన పార్టీకి అధ్యక్షుడు..
కావాలనే పోలీసులు జగన్ ను ట్రాఫిక్ లో అడ్డుకున్నారు..
ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సిట్టింగ్ జడ్జితో హై కోర్ట్ విచారణకు ఆదేశించాలి.