కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్య నేరం
పశువైద్యాధికారిని సౌజన్య దేవి
ముంచంగిపుట్టు, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి,11: మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొనికోడిపందాల పాల్గొనటం చట్టరీత్య నేరమని మండల పశువైద్యాధికారిణి ఎం సౌజన్య దేవి అన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆమెశనివారం విలేకరులతో మాట్లాడుతూ అల్లూరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు ఆదేశాల మేరకుపత్రిక ప్రకటన విడుదల చేస్తున్నామని హామీ అన్నారు. సంక్రాంతి పండుగ కోడి పందాలు నిర్వహించటం చట్టరీత్య నేరమని పండగ సమయంలో అక్రమ ఆచారం కొనసాగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అటువంటి కార్యకలాపాలను నిరోధించడానికి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంపి సి ఏ 1960 ప్రకారం కోడిపందాలు నిర్వహించటం శిక్షార్హమైన నేరంఅని అన్నారు.
సెక్షన్ 11 ఎ జంతువులకు అనవసరమైన నొప్పి లేదా బాధ కలిగించడాన్ని నిషేధిస్తుందమన్నారు.సెక్షన్ 11ఏం జంతువులను పోరాటానికి ప్రేరేపించడాన్ని నిషేధిస్తుంది.సెక్షన్ 11 (1)ఎన్ అటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులు మరియు వేదిక ప్రొవైడర్‌లకు జరిమానా చట్టపప్రకారం విధిస్తుందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974 ప్రకారంసెక్షన్ 9(1) పబ్లిక్ గేమింగ్ కార్యకలాపాలకు జరిమానా ఉంటుంది అనిఆమె అన్నారు. కోడిపందాలు ఆడిన నిర్వహించిన అటువంటి వారిపై సెక్షన్ 10ప్రకారం నేరస్థులను అరెస్టు చేయడానికి మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకోవడానికి పోలీసుశాఖ కు అధికారం ఉందని వైద్య అధికారిణి అన్నారు.అలాగె ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 10 ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 మరియు సెక్షన్ 34 జంతు హింస నివారణ చట్టం, 1960 ల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోబడు ఉందని వైద్యాధికారిణి పేర్కొన్నారు.