Sidebar


Welcome to Vizag Express
గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించిన సంక్రాంతి సంబరాలు

15-01-2025 16:47:50

గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించిన సంక్రాంతి సంబరాలు

విశాఖపట్నం, వైజాగ్‌ ఎక్స్‌ప్రెస్‌, జనవరి 15: తరాలు మారుతున్నా, వన్నె తరగని  సంస్కృతి, సంప్రదాయాలను విలువలు తగ్గకుండా కాపాడుకుంటూ కొనసాగించవలసిన అవసరాన్ని కంఫర్ట్ హోమ్స్ నివాసితులు తేటతెల్లం చేశారు. తెలుగు నేల పెద్ద పండుగగా భావించే  భోగి, సంక్రాంతి, కనుమ సంబరాల్ని 95వ వార్డు పరిధిలోని పురుషోత్తపురం నివాసితులు అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. వేకువజామున, ఆరు బయట సంప్రదాయబద్దంగా భోగి మంటను వేసి సందడి చేశారు. నింగిలోన చుక్కల్ని నేలకు దిగేలా, రంగవల్లికల్ని తీర్చిదిద్దిన శ్రీ విజయ గణపతి దేవాలయం ప్రాంగణం ముందు “అయ్యగారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు" అంటూ.. గంగిరెద్దుల వాళ్ళ ఆదేశాలతో బసవన్నల దీవెనలు... హరిదాసు" హరిలో రంగ హరీ" కీర్తనామృతంతో ఆబాలగోపాలం ఆనంద పరవశులయ్యారు. కాంక్రీట్ జంగిల్ వంటి నగరంలోనూ గ్రామీణ వాతావరణం ప్రతిబింబిస్తూ  కొనసాగిన అంబరాన్నంటిన సంబరాలు ప్రతి ఒక్కరిలోనూ కొంగ్రోత్త ఆశల్ని రగిలించాయి. కంఫర్ట్ హోమ్స్  నివాసితుల సంఘం, ఆలయ కమిటీ కార్యవర్గం నేతృత్వంలో ఈ వేడుకలు నిర్వహించారు.