Sidebar


Welcome to Vizag Express
మన్యం జిల్లా వైసీపీ పార్టీ యూత్ అధ్యక్షుడుగా నంగి రెడ్డి శరత్ బాబు

15-01-2025 21:29:51

మన్యం జిల్లా వైసీపీ పార్టీ యూత్ అధ్యక్షుడుగా నంగి రెడ్డి శరత్ బాబు 
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 15:
 కొమరాడ మండల వైస్ ఎంపీపీ నంగి రెడ్డి శరత్ బాబును మన్యం జిల్లా యూత్ అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఆయన మంగళవారం సాయంత్రం జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు దంపతులను  కలిసి వారిని సన్మానించారు. శరత్ బాబు మాట్లాడుతూ నాకు పార్టీ ఇచ్చిన  పదవితో మరింత బాధ్యత పెరిగింది అన్నారు. అంతేకాకుండా  పార్టీ బలోపేతానికి సాయ శక్తుల కష్టపడతారన్నారు. జిల్లాలో ఉన్న అందరి నాయకులు , కార్యకర్తలతో  సమిష్టిగా కలిసి పనిచేసి పార్టీ విజయానికి దోహదపడ తానన్నారు. నాకు పార్టీలో గుర్తింపు నిచ్చిన మన్యం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు పరి క్షిత్ రాజుకు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కి రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.