సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి.
గుమ్మ లక్ష్మీపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 15 :
పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, తాడికొండ గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో ప్రభుత్వ విప్, కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామంలో వివిధ రకాల ఆటలు పోటీలను నిర్వహించారు.
దీనిలో భాగంగా ఎమ్మెల్యే మహిళలతో కబడ్డీ ఆడి ఉత్సాహ పరిచారు. ప్రజలందరితో మమేకమై ఒక కుటుంబంలా ఇలా సంక్రాంతి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతుల ప్రధానం చేస్తారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.