Sidebar


Welcome to Vizag Express
శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద ఆలయ సిబ్బంది చేతివాటం

15-01-2025 21:37:05

శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద ఆలయ సిబ్బంది చేతివాటం 

-  8 మంది సస్పెన్షన్‌

అమరావతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్‌; నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రం టోల్‌గేట్‌ వద్ద ఉన్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో 8 మందిపై వేటు పడింది. టోల్‌గేట్‌లో ఉండాల్సిన డబ్బు కంటే అధికంగా డబ్బు ఉన్నట్లు ఈవో (గుర్తించి వారిపై సస్పెన్షన్‌  వేటు వేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే టోల్‌గేట్‌ వద్ద వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తారు. ఈ నెల 5న దేవస్థానం అధికారులు టోల్‌గేట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే సిబ్బంది వద్ద ఉండాల్సిన డబ్బుకంటే అధికంగా డబ్బు ఉన్నట్లు గుర్తించి విచారణ చేపట్టారు. విచారణ నివేదికను ఆలయ ఈవో శ్రీనివాసరావు పరిశీలించి 8 మందిపై చర్యలు తీసుకున్నారు. టోల్‌గేట్‌లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి ఎం రామకృష్ణుడుతోపాటు కాంట్రాక్టు సిబ్బంది జి మల్లికార్జున రెడ్డి, బి నాగ పరమేశ్వరుడు, ఎన్ గోవిందు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు మల్లికార్జున రెడ్డి, బీఆర్‌ మల్లేశ్వర్ రెడ్డి, డైలీ వేజ్ సిబ్బంది , టోల్‌గేట్‌ ఇన్‌చార్జి అధికారి శ్రీనివాసరావుని వీధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు . వారి స్థానంలో ఇతర సిబ్బందిని నియమించారు.