తిరుపతిలో రచ్చ రచ్చ మోహన్ బాబు వర్సెస్ మనోజ్ బౌన్లర్ల పోరు
- పరస్పరం రాళ్లు విసురుకోవడం
- ఇరువర్గాలపై లాఠీచార్జ్
తిరుపతి, వైజాగ్ ఎక్స్‌ప్రెస్; తిరుపతి నగరంలో సంక్రాంతి వేళ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. రంగంపేటలోని వివాదాస్పద మోహన్ బాబు యూనివర్శిటీలోకి ఇవాళ వెళ్లేందుకు వచ్చిన ఆయన కుమారుడు మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులకు పోలీసులు కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ను ఇచ్చారు. అయితే మంచు మనోజ్ ఇవేవీ పట్టించుకోకుండా బౌన్సర్ల సాయంతో మోహన్ బాబు యూనివర్శిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మోహన్ బాబు వర్సిటీ బౌన్సర్లు వీరిని అడ్డుకున్నారు. చివరికి పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాల్నీ చెదరగొట్టాయి. రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్శిటీలో మోహన్ బాబు తల్లితండ్రుల సమాధులు ఉన్నాయి. వీటిని దర్శించుకునేందుకు ఇవాళ మంచు మనోజ్-భూమా మౌనిక దంపతులు వర్సిటీకి వచ్చారు. యూనివర్సిటీలో ఆవరణలో ఉన్న తాత నారాయణస్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మల సమాధులను దర్శించుకునేందుకు వీరు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్శిటీలోకి వెళ్లేందుకు కోర్టు ఆంక్షలు ఉన్నాయని మనోజ్ కు తెలిపారు. అయితే తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నానని, కోర్టు సమాధుల వద్దకు వెళ్లొద్దని చెప్పలేదని వాగ్వాదానికి దిగారు. మరోవైపు మంచు మనోజ్-భూమా మౌనిక దంపతుల్ని అనుమతించకపోవడంతో వారి బౌన్సర్లు మోహన్ బాబు వర్శిటీ బౌన్లర్లతో దాడికి దిగారు. పరస్పరం వీరు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి వీరిని నియంత్రించారు. అనంతరం కేవలం దండం పెట్టుకుని వస్తానని చెప్పడంతో మంచు మనోజ్ దంపతుల్ని పోలీసులు లోపలికి అనుమతించారు. దీంతో సమాధుల వద్దకు వెళ్లిన వీరు.. కాసేపటికి బయటికి వచ్చి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం గొడవ సద్దు మణిగింది. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం మోహన్ బాబు వర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై మంచు మనోజ్ ప్రశ్నిస్తుండమే.