Sidebar


Welcome to Vizag Express
స్కిల్ స్కామ్‌లో బాబుకు ఊర‌ట‌

15-01-2025 21:39:55

స్కిల్ స్కామ్‌లో బాబుకు ఊర‌ట‌

ఏపీ సీఎం చంద్రబాబుకు సంక్రాంతి వేళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం తనపై దాఖలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అవినీతి కేసులో బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు  బుధ‌వారం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబుకు అధికారంలోకి వచ్చాక తొలిసారి ఈ కేసులో ఊరట దక్కినట్లయింది. గతంలో ఏపీ ఏసీబీ నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో సీఎం చంద్రబాబు పాత్రపై విచారణ జరిగింది. ఆయన్ను ఈ కేసులో అప్పట్లో 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగినా తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు. ఇలాంటి తరుణంలో గతంలో వైసీపీ సర్కార్ చంద్రబాబుకు అప్పట్లో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  దీనిపై విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం  తన తీర్పు వెల్లడించింది. గతంలో చంద్రబాబుకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ కూడా దాఖలైందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ కొనసాగనుంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లో దాదాపు రూ.361 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుతో పాటు పలువురు నిందితుల్ని అరెస్టు చేసింది. అయితే ఆ తర్వాత గవర్నర్ అనుమతి లేకుండా తనను అరెస్టు చేయడం చెల్లదంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అదే సమయంలో రాజమండ్రి జైల్లో ఉంటూనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి హైకోర్టు సరేనంది. ఆ తర్వాత వైసీపీ సర్కార్ చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.