సంక్రాంతి పండగ కు వచ్చి చిన్నారి మృత్యువాత
. కుటుంబంలో తీవ్ర విషాదం
. ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది
విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్; ఫార్మా కంపెనీ ఉద్యోగి నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. సుజాతనగర్ కు చెందిన దంపతులు సెలస్ట్ అపార్ట్మెంట్లోని బంధువుల ఇంటికి సంక్రాంతి పండక్కి వచ్చారు. చిన్నారి సెల్లార్ వద్ద ఆడుకుంటుండగా ఈ కారు ఢీకొట్టింది.
కిమ్స్ హాస్పిటల్ తీసుకువెళ్తుండ గా మార్గం మధ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనితో పండగ తో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.