అనాధాశ్రమంలో సంక్రాంతి సంబరాలు
15-01-2025 21:42:51
అనాధాశ్రమంలో సంక్రాంతి సంబరాలు
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 15:
సీతయ్య ఫౌండేషన్ అనాధాశ్రమంలో ఆశ్రమ వృద్ధులు, విద్యార్థులకు భోగి, సంక్రాంతి , కనుమ పండుగలుతో ఆనందంగా గడిపారు. ఎటువంటి దక్షత లేక .. పరిస్థితుల ప్రభావంతో.. ఆశ్రమం దరిచేరిన "అభాగ్యుల"కు సంవత్సరం పొడుగునా వచ్చే పండగల ఆనందాన్ని పంచిపెట్టాలనే సదుద్దేశ్యంతో.. ఈ పండగ శుభ దినాలలో భోగి, మకర సక్రాంతి తో పాటు.. .."కనుమ" పర్వదినమున..వృద్ధాశ్రమం ప్రాంగణంలో సేదతీరుతూ..సేవలో తరిస్తున్న "గోమాతలకు" పూజలు చేసి.. పండగలను సంతోషాలుతో జరిపారు. పండగ ఆనంద ఘడియలను ఆస్వాదించిన వృద్ధుల ఆశీస్సులు,పుణ్యఫలాలు.. దాతృత్వ దాతలకు, శ్రేయోభిలాషులకు ప్రాప్తించాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. గోమాతల సేవలో తరించిన సహచర సభ్యులు సోంపేట కు చెందిన"సానా. గణేష్ (కన్న) "కిమ్మోజి. డిల్లేశ్వరరావు" లకు "సీతయ్య ఫౌండేషన్ " తరుపున ప్రత్యేకంగా అభినందించారు