అవినీతి పై శివలెత్తుతున్న నగర్ పోలీస్ కమిషనర్.డా.శంఖబ్రత బాగ్చి,
15-01-2025 21:53:12
అవినీతి పై శివలెత్తుతున్న నగర్ పోలీస్ కమిషనర్.డా.శంఖబ్రత బాగ్చి,
విశాఖపట్నం - వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి, 15: విశాఖపట్నం కి ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ కమిషనర్లు వేరు, ఇపుడు ఉన్న పోలీస్ కమిషనర్ వేరు. ఆయన విశాఖ సిటి లో అడుగుపెట్టినప్పటి నుండి అవినీతి పై అలుపెరుగనిపోరాటం చేస్తున్నారు. ప్రజలు కు నిత్యం తాను అందుబాటులో ఉంటూ సిబ్బందికి ఆదర్శం గా నిలిస్తున్నారు. ఆయనే విశాఖపట్నం పోలీస్ బాస్ డా.శంఖబ్రత బాగ్చి. ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ వర్క్ చేయటానికి ఇష్టం లేక కొంతమంది అవినీతి ఆరోపణలు ఉన్న సిబ్బంది ముందుగానే సర్దుకున్నారు.ప్రజలు కు అత్యంత సేవలు అందించటానికి ఆయన నిద్ర పోరు, సిబ్బందికి నిద్ర పోనీయురు. ఇది ఆయన వరుస. ఇలా పొతే ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలు తో కానిస్టేబుల్ నుండి ఏసీపీ అధికారి వరకు చర్యలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర అధినేతలు విశాఖపట్నం లో పర్యటన కు ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయం గా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విధులలో అవినీతికి పాల్పడిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ను బుధవారం సస్పెండ్ చేసారు. నగర స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నాయని సిపి దృష్టికి రావడం జరిగినది. ప్రాథమిక విచారణలో హెడ్ కానిస్టేబుల్ కాల్ డేటా లోని ఫోన్ నంబర్ల ద్వారా గత రెండు సంవత్సరాలుగా (2023-2024) ఒక కేసు నందు నిందితులుగా ఉన్న క్రికెట్ బుకీ ముద్దాయిలతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయినది. పోలీసు కమీషనర్ పై సంఘటన పై తీవ్రంగా స్పందించి, నగర స్పెషల్ బ్రాంచ్ నందు హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పి.గంగ రాజు తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేశారు. నగర పోలీసు శాఖ లో పని చేయు అధికారులు మరియు సిబ్బంది పూర్తి పారదర్శకముగా తమ విధులు నిర్వర్తించాలని, విధులలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠిన చర్యలు ఉంటాయనీ తెలిపారు.నగర పోలీసు శాఖలో ఎవరైనా లంచం అడిగినా , తీసుకున్నా వెంటనే సిపి గారు ఇచ్చిన 7995095799 నంబరుకు తెలియజేయమని, వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందనీ సిపి తెలియజేశారు.