Sidebar


Welcome to Vizag Express
కుమార్ రాజు కు ప్రతిష్టాత్మక "తెలుగు కీర్తి "పురస్కారం

16-01-2025 20:45:17

కుమార్ రాజు కు ప్రతిష్టాత్మక "తెలుగు కీర్తి "పురస్కారం 
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్;
శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, శ్రీ శ్రీ కళా వేదిక అధ్యక్షుడు, కవి రచయిత బుర్రి కుమార్ రాజు తెలుగు కీర్తి పురస్కారం కు ఎంపికైనట్లు శ్రీ శ్రీ కళా వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి మండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ కొల్లి రమా వతి ల నుంచి సమాచారం అందుకున్న కవి కుమార్ రాజు తనను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కు ఎంపిక చేసినందులకు అంతర్జాతీయ అధ్యక్షుడు కత్తి మండ ప్రతాప్ కి జాతీయ కన్వీనర్ కొల్లి రమా వతి జాతీయ అధ్యక్షులు ఈశ్వరీ భూషణం, పార్థ సారధి గార్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేసినారు . కుమార్ రాజు విద్యాభ్యాసం నాటినుంచి తన కవితలతో అలరించే వారని, అలా ఎన్నో కవితలు పత్రికలలో ప్రచురించటం తో తెలుగు సాహిత్యం పై ఆసక్తి పెరిగిందని తెలియ పరిచారు. ఈ పురస్కారం జనవరి 21 మంగళవారం 2025 న శ్రీ కౌతా పూర్ణానంద విలాస్ కళావేదిక , విజయ వాడ లో జరుగు తుంది అని తెలిపారు