రహదారి భద్రత మాసోత్సవాలు
16-01-2025 20:46:35
రహదారి భద్రత మాసోత్సవాలు
శ్రీకాకుళం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 16: కేంద్ర కార్యాలయం వారి ఆదేశాల మేరకు జనవరి 16వ తేద నుండి ఫిబ్రవరి 15వ తేది వరకు రహదారి భద్రత మాసోత్సవాలు. ఇందులో భాగంగా 16వ తేది నాడు శ్రీకాకుళం-1వ డిపో గ్యారేజ్ ఆవరణలో ప్రారంభోత్సవ సభను నిర్వహించడం జరిగినది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం పట్టణ ట్రాఫిక్ ఎస్సై దేవదానం హాజరైనారు. సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ చోదకులు రహదారిపై భారీవాహనాలను నడిపేటప్పుడు ఏకాగ్రత మరియు ఇతర వాహన చోదకుల గమనాలను గమనిస్తూ తద్వారా భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని ప్రయాణికులకు కల్పించాలని కోరారు. శ్రీకాకుళం 1వ డిపో మేనేజరు సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రమాదరహిత సుఖవంతమైన సురక్షితమైన ప్రయాణాన్ని ప్రయాణికులకు అందించి తద్వారా వారి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం-2 డిపో మేనేజర్ శర్మ మరియు శ్రీకాకుళం-1,2 సహాయ మేనేజర్లు రమేష్, గంగరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎల్.ఎస్. నాయుడు, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్సట్రక్టర్లు భాస్కరరావు, మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు, భద్రత మరియు నిఘా విభాగం వారు, డ్రైవర్లు, మెకానికులు, పి.ఆర్.ఓ. సుమన్ తదితరులు పాల్గొన్నారు.