Sidebar


Welcome to Vizag Express
పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

16-01-2025 21:20:45

పూర్వ విద్యార్థులు ఆత్మీయ  సమ్మేళనం
రేగిడి జనవరి 16 వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్ 
రేగిడి ఆమదాలవలస మండలం దేవుదళ
జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్లో 2003-2004 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న  పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గురువారం నాడు నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 
ఆనాటి హెడ్ మాస్టర్ కెoబూరుఅప్పలనాయుడు, తెలుగు మాస్టర్ కెoబూరు రామినాయుడు, హిందీ టీచర్ ఆదిలక్ష్మి, ఫిజిక్స్ టీచర్ సూర్యనారాయణ,జేమ్స్ కుమార్, పి ఈ టి టీచర్ హైమావతి, సోషల్ టీచర్ మల్లేశ్వరరావు, ఇంగ్లీష్ టీచర్ ఉమామహేశ్వరరావు లెక్కలు టీచర్ ఆనందరావు తదితర ఉపాధ్యాయులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి తమను గుర్తించుకొని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని,నేటికి ఈ విద్యార్థుల కలవడం 21 సంవత్సరం పూర్తి అయిందని ఈరోజు ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు, పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి ఒక్కొక్కరు మాట్లాడుతూ అనాటి ఉపాధ్యాయులు విద్యాభ్యాసం చెప్పడం వలన  వివిధ రంగాల్లో రాణించామని, వాళ్లకి జీవితాంతం రుణపడి ఉంటామని, ఈ కార్యక్రమం పిలిచిన వెంటనే వచ్చినందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.అనంతరo విందును ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరగించి ఆనాటి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకొని. ఆటపాటలతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఇప్పటి దేవుదళ స్కూల్ హెచ్ఎం ఎస్. రాజ్యలక్ష్మి ఫిజిక్స్ మాస్టారు మెయ్యరామకృష్ణారావు, పి. వెంకటరమణ, రికార్డ్ అసిస్టెంట్ రమణ
 ఉపాధ్యాయులు పాల్గొన్నారు