అనారోగ్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి
16-01-2025 21:22:45
అనారోగ్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతి
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 16:
కొమరాడ మండల పరిధిలోని అర్తాం గ్రామానికి చెందిన కొప్పర వెంకటరమణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురువారం ఉదయం 4గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు మండలంలోని పలువురు తెలుగుదేశం సీనియర్ నాయకులు ప్రగాడ సానుభూతి తెలిపారు. అంతేకాకుండా ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండ దండగా ఉంటుందన్నారు. ఆయన మృతి పట్ల తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శనపతి శేఖర్ పాత్రుడు, అరకు పార్లమెంట్ రైతు కమిటీ అధ్యక్షులు దేవకోటి వెంకటనాయుడు, గులి పిల్లి సుదర్శన రావు,పొట్నూరు వెంకట్ నాయుడు, అర్తాం పంచాయతీ సర్పంచ్ గాజుల శ్రీనివాసరావు,ఉప సర్పంచ్ శంకరరావు ,కె.శ్రీనివాస్ ,కె.సత్యంనారాయణ సంతాపం తెలిపారు