Sidebar


Welcome to Vizag Express
ఏనుగులు వల్ల మేకలకు తృటిలో తప్పిన భారీ ప్రమాదం

16-01-2025 21:24:07

ఏనుగులు వల్ల మేకలకు  తృటిలో  తప్పిన భారీ ప్రమాదం
కొమరాడ, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 16:
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని బుధవారం రాత్రి కొమరాడ  పంచాయతీ కొమరాడ కొత్తవలస గ్రామ సమీపంలో ఉన్న యాదవుల గొర్రెల మందపై  రాత్రి ఏనుగులు వల్ల భారీ ప్రమాదం తప్పింది. ఏనుగుల దాడి వలన యాదవుల యొక్క వంట సామాగ్రి మొత్తం  ధ్వంసం చేసే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో ఏనుగులు కాపలా కాస్తున్న కేర్ ట్యాకర్లు కూడా కొమరాడ కొత్తవలస గ్రామ సమీపంలో రాత్రివేళ ఉండిపోవడంతో ఏనుగులు గొర్రెల మంద వైపు  వెళ్తున్న సందర్భంలో ఒకేసారి గొర్రెలన్నీ పారిపోవడంతో అక్కడ ఉన్న ఇద్దరు గొర్రెలు కాపర్లు కూడా ఏనుగులు చూసి పారిపోవడంతో ప్రాణప్రాయం భారీగా తగ్గిందని లేనియెడల గొర్రెలతో పాటు ఇద్దరు యాదవులు కూడా మరణించే పరిస్థితి ఉందని ఇదే కాదు ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ ఏనుగులు అడవికి లేదా జూకి తరలించే విషయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా చెప్పే ప్రాప్తికి అటవీ  శాఖ అధికారులు ముందుకి వెళ్ళకపోవడం చాలా దారుణమైన పరిస్థితి అని కాబట్టి వెంటనే ఏనుగులను అడవికి లేదా జూకి తరలించి రైతులు  పండించిన పంటలకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని  సిపిఎం పార్టీ  జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ప్రభుత్వాన్ని కోరారు.