Sidebar


Welcome to Vizag Express
బాపట్ల జిల్లా కేంద్రంలో విరివిగా అక్రమ కట్టడాలు

16-01-2025 21:25:41

బాపట్ల జిల్లా కేంద్రంలో విరివిగా అక్రమ కట్టడాలు 

చోద్యం చూస్తున్న పట్టణ ప్రణాళిక విభాగం

బాపట్ల, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 16 :
బాపట్ల జిల్లా కేంద్రంలో నానాటికి అక్రమ నిర్మాణాలు విరివిగా జరుగుతున్నప్పటికి సంబంధిత పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మాత్రం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వెల్లువత్తుతున్నాయి.పట్టణంలో చారిత్రక ప్రాచీన దేవాలయం శ్రీక్షీర భావన్నారాయణ స్వామి దేవస్థానంకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిషేధం ఉన్నప్పటికీ భారీ నిర్మాణాల యజమానులు సహకరిస్తున్న వారికి భారీగానే ముట్టచేబుతున్నారు అనే మాట బలంగా వినబడుతుంది.ఒకపక్క మునిసిపల్ కమీషనర్, పట్టణ పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయంగా ఉందని ఫుట్ పాత్ లపై ఉన్న దుకాణాలను తొలగిస్తుంటే మరోపక్క అసలు పార్కింగ్ లేకుండానే రోడ్డుకు ఆనుకొని శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నప్పటికి ఏ అధికారి కంటికి కనబడడంలేదు.ఆర్కియాలజీ, మునిసిపాలిటీ వారి నుండి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నాయి.పట్టణంలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇప్పటికైనా సంభంధిత అధికారులు స్పందించి సరైన అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.