Sidebar


Welcome to Vizag Express
తిరుగు ప్రయాణికులతో కిటకిటాలాడుతున్న బస్టాండ్, రైల్వేస్టేషన్లు

16-01-2025 21:28:43

తిరుగు ప్రయాణికులతో కిటకిటాలాడుతున్న బస్టాండ్, రైల్వేస్టేషన్లు  
అనపర్తి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి16: దేశంలోని అనేక నగరాలు,పట్టణాల్లో నివసిస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సంక్రాంతికి సొంతూళ్ళకు వచ్చి బంధు, మిత్రులతో నాలుగు రోజులు పాటు ఆనందంగా గడిపారు.నాలుగు రోజుల పాటు గ్రామాలన్నీ బంధువులు రాకతో కలకలాడాయి.ముక్కనుమతో సంక్రాంతి సంబరాలు ముగియడంతో గురువారం నుండి కొత్త అల్లుళ్ళు,మనవులు, మనవరాళ్ళు,ఇతర బంధు, మిత్రులు తిరుగు ప్రయాణం కావడంతో పల్లెలు బోసు పోతున్నాయి.ఆప్పుడే నాలుగు రోజులు అయ్యిపోయిందా అనే ఫీలింగ్ లో సంక్రాంతి బంధువులు ఉండగా తిరుగు ప్రయాణికులతో బస్టాండ్, రైల్వేస్టేషన్లు జనాలతో రద్దీగా మారాయి.రేపు శుక్రవారం రాకపోకలు తక్కువగా ఉన్నప్పటికీ శని, ఆదివారాల్లో విపరీతమైన రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఆ రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఫుల్ కావడం విశేషం.నాలుగు రోజులు ఆనందంగా గడిపిన బంధు, మిత్రులు ఒకింత బాధతతో వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తూ గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తప్పదన్నట్టు వెళ్ళడం మరో విశేషం.