Sidebar


Welcome to Vizag Express
రహదారి యొక్క భద్రత మాసోత్సవాలు

16-01-2025 21:33:27

రహదారి యొక్క భద్రత మాసోత్సవాలు


మాధవధార , వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ డిసెంబర్:16 రహదారి భద్రత పై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు దేశం లో గత 36 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో కేంద్ర మరియు రాష్ట్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వశాఖ ఆదేశాల ప్రకారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ఈ నెల 16 జనవరి 2025 నుండి 15 ఫిబ్రవరి,2025 వరకు నిర్వహించబడుతుంది. కావునా అందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో తేదీ 16.01.2025 న జిల్లా కలెక్టర్, మరియు జిల్లా న్యాయాధికారి, శ్రీ ఎం. ఎన్. హరింద్ర ప్రసాద్ IAS వారిచే జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు -2025 కు సంబందించిన బేనర్స్, ప్రచార కరపత్రాలను విడుదల చేయటం జరిగినది. ఇందులో భాగంగా ఉప రవాణా కమిషనర్ జి ఆదినారాయణ ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు మరియు వాహన తనికి అధికారులు, తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. తదుపరి,ఉప రవాణా కమిషనర్ మాట్లాడినప్పుడు వెహికల్ నడిపెటప్పుడు ప్రతిఒక్కరు శ్రద్ధ వహించి (ఈ సంవత్సరం స్లోగన్) ఆచరిస్తూ తమ  గమ్యాలన్నీ సురక్షితంగా చేరుకోవాలని తెలిపారు