అయినవిల్లి వినాయక స్వామివారి సన్నిధిలో ప్రేమాయణం కేరాఫ్ ధర్మవరం సినిమా షూటింగ్ ప్రారంభం
అయినవిల్లి, వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 16:
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లిలో ప్రసిద్ధిగాంచిన సిద్ది వినాయక స్వామివారి సన్నిధిలో ప్రేమాయణం కేరాఫ్ ధర్మవరం సినిమా షూటింగ్ ను నిర్మాత ఎన్ 9 ఛానల్ అధినేత పెంకె శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది వీళ్ళ దొరబాబు చేతుల మీదుగా క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత శ్రీనివాస్
కెమెరా స్విచ్ అన్ చేసి మొదటి షార్ట్ ను తీశారు. ఈ సంధర్బంగా మీడియాతో చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడుతూ చిత్రాన్ని మొత్తం కోనసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అన్న చెల్లెళ్ళ మధ్య జరిగే సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి తొందరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేస్తామని, నటీనటులు అందరూ కొత్తవారితో మొదటి ప్రయత్నం చేస్తున్నామని, చిత్రం పూర్తి నిర్మాణం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత, దర్శకులు,నటులు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో జర్నలిస్టులు ఏబీసీ ఛానల్ అత్తులూరి కిషోర్, ప్రజాకాంక్ష గుత్తుల మురళీ, విశ్వం వాయిస్ న్యూస్ రత్నకిషోర్ కె, ఎస్7 న్యూస్ వర ప్రసాద్ ఎన్9 డైరెక్టర్ పిల్లి దుర్గాప్రసాద్ మరియు తదితర నటీనటులు పాల్గొన్నారు.