ఎన్నాలో వేచిన రోజు!
16-01-2025 22:23:11
ఎన్నాలో వేచిన రోజు!
ఈ రోజే నిజమైంది!
బారువలో పూర్వ విద్యార్థులు పలకరింతలు!
సోంపేట ,వైజాగ్ ,ఎక్స్ ,ప్రెస్ ,జనవరి 16:
2004 -2007 లో బారువ డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు కలిసి చదివిన 40 మంది పూర్వ విద్యార్థులు గురువారం ఒకే చోట కలిసి ఒకరికొకరు పలకరించుకొని పాత జ్ఞాపకాలను నెభరవేసుకుంటూ పులకించిపోయారు. ఏళ్ల తరబడి కలవాలనుకునే ప్రయత్నం 17 ఏళ్ల తర్వాత కలిసే అరుదైన అవకాశం ఈరోజు దక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురువారం బారువ డిగ్రీ కళాశాల ఆవరణలో చెట్టు నీడన కలుసుకున్నారు. ఎక్కడెక్కడో ఉంటున్న మిత్రులకు 17 ఏళ్ల తర్వాత ఒకసారి కలుసుకునే సరిగా ఉధ్విగ్నభరిత వాతావరణం ఏర్పడింది. చిన్ననాటి సంఘటనలు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఆడుతూ పాడుతూ రోజంతా సందడి చేశారు. బారువ కు భువనేశ్వర్ ప్రసాద్ , ఆనంగి తేజేశ్వరరావు, మడ్డు కూర్మారావు ,కాళీప్రసాద్ , పోలాకి రమణ, ప్రవీణ్ కుమార్ ల చొరవతో అందరూ ఒకే చోటు కలుసుకున్నారు. వీరిలో పదిమంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో ఉన్నారు.వీరంతా వారి వారి స్థాయిలు మరిచి పిల్లలా సందడి చేసారు. ఈ సందర్భంగా నాటి గురువులు ఇంగ్లీష్, హిస్టరీ లెక్చరర్లు రామారావు లకు ఈ సందర్భంగా సన్మానించి గురువుల రుణాన్ని తీర్చుకున్నారు .తాము చదివిన కళాశాల అభివృద్ధికి తమ వంతు సాయంగా పేన్లు ,విద్యార్థులకు అవసరమైన ఇతర వస్తువులు అందజేశారు.